గుంతకల్లు: గుత్తి మండలం ఎంగిలిబండ శివారులో పంట పొలాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు
అనంతపురం జిల్లా గుత్తి మండలం ఎంగిలిబండ గ్రామ శివారులో పంట పొలాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 88 బస్తాల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. అందుకు సంబంధించి గుత్తి ఎస్ఐ అమీర్ ఖాన్ మంగళవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుత్తి మండలం ఎంగిలిబండ గ్రామ శివారులోని వ్యవసాయ పొలాల్లో పేదలకు అందాల్సిన పీడీఎస్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచారని సమాచారం అందింది. పక్కా సమాచారంతో గుత్తి ఎస్ఐ అమీర్ ఖాన్ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఓ పొలంలో అక్రమంగా నిల్వ ఉంచిన 40 క్వింటాళ్ల కు సంబంధించి 88 బస్తాల పీడీఎస్ బియ్యాన్ని గుర్తించి పట్టుకున్నారు. రెవెన్యూ, పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు.