సంగారెడ్డి: సంగారెడ్డిలో ఘనంగా పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకలు
సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో పండుగ సాయన్న ముదిరాజ్ గారి జయంతి వేడుకలు జరిగాయి. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాయన్న గారి పోరాట పటిమను, ఆశయాలను స్మరించుకుంటూ, సమాజంలో శాంతి, సమానత్వం కోసం కృషి చేయాలని ఎస్పీ పిలుపునిచ్చారు.