పటాన్చెరు: నేడు గుమ్మడిదల, జిన్నారం ఉమ్మడి మండలాల్లో విద్యుత్ సరఫరా లో అంతరాయం
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల 132 కేవీ స్టేషన్లో మరమ్మతుల కారణంగా గురువారం విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏడీ దుర్గాప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. జిన్నారం, గుమ్మడిదల పరిధిలోని గ్రామాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. దయచేసి విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని ఏఈలు రవీందర్, వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు.