స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ సాధనకు విద్యార్థులు అందరూ కృషి చేయాలి,సామర్లకోట పీఎం శ్రీ మున్సిపల్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు.
కాకినాడ జిల్లా సామర్లకోట పట్నం అయోధ్య రామ పురం నందు గల, పి ఎం శ్రీ మున్సిపల్ ఉన్నత పాఠశాల యందు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, తోటకూర సాయి రామకృష్ణ ఆధ్వర్యంలో, పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఓజోన్ పరిరక్షణకు ప్లాస్టిక్ వినియోగం విడనాడదామని, ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, సెప్టెంబర్ 16వ తేదీ నుండి నెల ఆఖరి వరకు విద్యార్థుల్లో పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రతలపై, రోజువారి షెడ్యూల్ ద్వారా అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.