కనిగిరి మండలంలోని పేరంగుడి పల్లి గ్రామంలో నిర్మిస్తున్న గురుకుల పాఠశాల భవనాల నిర్మాణ పనులను ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు మరియు కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు నర్సింహారెడ్డి శనివారం పరిశీలించారు. పాఠశాల గదుల నిర్మాణం, విద్యార్థులకు కల్పించనున్న సౌకర్యాలను ఎమ్మెల్యే పరిశీలించారు. గురుకుల పాఠశాల నిర్మాణ పనుల్లో రాజీ పడకుండా నాణ్యతగా పనులను చేపట్టే విధంగా చూడాలని అధికారులను ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి ఆదేశించారు. నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యే విధంగా చూడాలన్నారు.