ఏటూరునాగారం: 6వ రోజుకు చేరిన ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమ్మె - వినూత్న నిరసన
ఏటూరునాగారం ఏరియా ఆసుపత్రి వద్ద ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె 6వ రోజుకు చేరుకుంది. బతుకమ్మ ఆడుతూ వినూత్నంగా నిరసన తెలిపిన ఉద్యోగులు, తమను రెగ్యులరైజ్ చేయాలని, పెరిగిన వేతనాలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత మరియు హెల్త్ కార్డులు కల్పించాలని డిమాండ్ చేశారు.