నందవరం శ్రీ చౌడేశ్వరి మాతకు వైభవంగా సహస్ర దీపాలంకరణ సేవ.
నంద్యాల జిల్లాబనగానపల్లె మండలం నందవరంలో వెలసిన ప్రముఖ క్షేత్రమైన శ్రీ చౌడేశ్వరి దేవి క్షేత్రంలో ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి, ఛైర్మన్ పీవీ నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం పౌర్ణమి సందర్భంగా సహస్రదీపాలంకరణ వైభవంగా నిర్వహించారు. అర్చకులు సాయంత్రం అమ్మవారికి పూజల అనంతరం అమ్మవారిని ప్రత్యేక పల్లకిలో కొలువుంచి ఉయ్యాల సేవ నిర్వహించారు. ఆలయ మాడ వీధుల్లో వైభవంగా పల్లకిసేవ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు