శ్రీశైలం: భోదనం గ్రామంలో శ్రీ ముక్తేశ్వర స్వామి ధ్వజస్తం ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న శ్రీశైలం MLA బుడ్డా రాజశేఖరరెడ్డి
బండి ఆత్మకూరు మండలం బోధనం గ్రామంలో నిర్వహించిన శ్రీ ముక్తేశ్వరస్వామి ధ్వజస్తంభ ప్రతిష్ఠతో పాటు పరివార సమేత లక్ష్మీ గణపతి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.