శ్రీకాకుళం: శ్రీకాకుళంలో బోల్తా పడిన నామినేషన్ వాహనం: నలుగురికి గాయాలు
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కొత్తకూర్మి - నాయుడుపేట సమీపంలో నామినేషన్ కోసం వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో డ్రైవర్ రమణతో పాటు మరో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు, ఎవరికీ ప్రాణాపాయం లేదు.