శ్రీశైలం: జనాభా గణన గడువులోపు పూర్తి చేయకపోతే చర్యలు తప్పవు: ఆత్మకూరు తాసిల్దార్ రత్న రాధిక
ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో జనాభా గణనపై కీలక సమావేశం జరిగింది.నంద్యాల జిల్లా ఇంచార్జి సెన్సస్ అధికారి విష్ణు మాధురి, తహసీల్దార్ రత్నా రాధిక సూపర్వైజర్లతో సమావేశమయ్యారు.జనాభా గణనను కచ్చితత్వంతో, ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు పూర్తి చేయాలని సూచించారు.ఆత్మకూరు అర్బన్ ప్రాంతంలోని ఎన్యూమరేటర్లు పనిలో వెనుకబడి ఉన్నారని తహసీల్దార్ తెలిపారు. గడువులోగా పని పూర్తి చేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.వలస వెళ్లిన వారిని కూడా తప్పనిసరిగా జనాభా గణనలో నమోదు చేయాలని డివిజనల్ గణాంక అధికారి నాగరాజు సూచించారు.