ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం ముఖ్య భూమిక పోషిస్తుందని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు తెలిపారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లా సచివాలయం లోని భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి అనంతరం పిజిఆర్ఎస్ హాల్ నందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ ప్రజాస్వామ్య భారతదేశంలో రాజ్యాంగం ద్వారా ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వం తో పాటు సాంఘిక, ఆర్థిక,రాజకీయ సమానత్వం అందుతోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులందరూ ప్రతిజ్ఞ చేశారు.