రొళ్ల మండల నూతన ఎస్సైగా వీరేష్..
రొల్ల మండల నూతన ఎస్సైగా వీరేష్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఇంతకుముందు అగళి మండల ఎస్సైగా వీరేష్ పని చేస్తున్నారు.అధికారులు రొళ్ల ఎస్సైగా బదిలీ చేయడంతో సోమవారం బాధ్యతలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.మండలంలో అక్రమ మద్యం, జూదం, పేకాట శిబిరాలు నిర్వహిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.గ్రామాల్లో ఎటువంటి కక్షలు లేకుండా ప్రశాంతంగా ఉండాలని సూచించారు.