ఆ విషయంలో ఎంతవరకైనా పోరాడుతామన్న మడకశిర వైకాపా నేత ఈర లక్కప్ప.
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ఆ విషయంలో ఎంతవరకైనా పోరాడుతామని మడకశిర వైకాపా ఇన్చార్జ్ ఈర లక్కప్ప పేర్కొన్నారు. శుక్రవారం గుడిబండ మండలం మోపురుగుండు గ్రామంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామంలోని ప్రజల వద్దకు వెళ్లి మెడికల్ కళాశాలలో ప్రైవేటుపరం చేస్తే విద్యార్థులు ప్రజలు ఏ విధంగా నష్టపోతారో వివరించి సంతకాల సేకరణ చేశారు.ఈ కార్యక్రమంలో మండల వైకాపా నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.