ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరులో అనారోగ్యంతో బాధపడుతున్న 16 మందికి రూ.8.53 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే..
ఎమ్మిగనూరులో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ..ఎమ్మిగనూరు ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్లో ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న 16 మందికి రూ.8.53 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి ఈ నిధి పెద్దసహాయమని, ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని తెలిపారు.