నాగలాపురం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని పాల దుకాణంలో చోరీ
నాగలాపురం ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఆరోగ్య పాల దుకాణం తాళాలు పగలగొట్టి గురువారం రాత్రి దొంగలు ప్రవేశించారు. దుకాణాదారుడు అంగడి కౌంటర్లో ఉంచిన డబ్బులు రూ.80,000 నగదును దొంగలు ఎత్తుకెళ్లినట్లు యజమాని సాంబశివ శుక్రవారం ఉదయం తెలిపారు.. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.