పంగిడిగూడెం గ్రామంలో నాటు సారా తయారీ స్థావరంపై పోలీసులు దాడి, వ్యక్తి అరెస్టు, 20 లీటర్ల నాటుసారా స్వాధీనం
జంగారెడ్డిగూడెం ఇన్స్పెక్టర్ కృష్ణ బాబు యొక్క ఆధ్వర్యంలో ఎస్ఐ రామకృష్ణ కు రాబడిన సమాచారం మేరకు మండలంలోని పంగిడిగూడెం గ్రామంలో నాటు సారా స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 20 లీటర్ల నాటు సారా, సారా తయారీకి ఉపయోగించే సామాన్లు స్వాధీనం చేసుకుని రెండు వందల లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసీ వ్యక్తిపై కేసు నమోదు చేశారు.