దర్శి: తూర్పు గంగవరం సోమవరపాడు పరిధిలోని గుంటి గంగమ్మ తిరునాళ్ల సందర్భంగా ఆలయం వద్ద భారీ ట్రాఫిక్ అంతరాయం
Darsi, Prakasam | Apr 14, 2025 తాళ్లూరు మండలంలోని తూర్పు గంగవరం పంచాయతీలోని సోమవరపాడు పరిధిలోని గుంటి గంగమ్మ తిరునాళ్ల అంగరంగ వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేయగా ఈ సందర్భంగా సోమవారం ఆలయం వద్ద భారీ ట్రాఫిక్ అంతరాయం కలిగింది. సుమారు రెండు కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయాయి. వెంటనే స్పందించిన పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు.