ఓజోన్ పొర గురించి గుండుమల జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు చేసిన కార్యక్రమం ఆకట్టుకుంది.
మడకశిర మండలం గుండుమల గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మంగళవారం అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓజోన్ పొరవరన కలిగే ఉపయోగాలు నష్టాలను విద్యార్థుల ద్వారా పాఠశాల ఉపాధ్యాయులు చెప్పించారు. ప్రిన్సిపాల్ సుకన్య మాట్లాడుతూ ఓజోన్ పొర పరిరక్షించడం కోసం ప్రజలు ఎక్కువగా రిఫ్రిజిరేటర్లు ఏసీలను ఉపయోగించరాదని తద్వారా ప్రమాదకర రసాయనాలు వెలువడి ఓజోన్ పొర క్షీణించే అవకాశం ఉందన్నారు.