శ్రీకాకుళం: మెళియాపుట్టిలో పాము కాటుతో బాలిక మృతి, విషమంగా మరొకరి పరిస్థితి
మెళియాపుట్టి మండలం గొట్టిపల్లిలో విషాదం. బుధవారం తెల్లవారుజామున నిద్రిస్తున్న వారిని పాము కాటు వేయడంతో 6 ఏళ్ల నవ్య మృతి చెందింది. 35 ఏళ్ల రాముడు టెక్కలి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు, ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.