బండారులంకలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్
విద్యా వ్యాప్తికై మన బడి, నాడు-నేడు కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతూ, పిల్లలు బడికి ఆకర్షితులయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు. శుక్రవారం అమలాపురం రూరల్ మండల పరిధిలోని బండారులంక గ్రామంలో జరిగిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. బండారులంక గ్రామంలో 38 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన డా.బీఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ భవనాన్ని ఆయన ప్రారంభించారు.