పామూరు: పామూరు మండలంలో సమస్యలను పరిష్కరించాలని ఒంగోలు జడ్పీ సమావేశంలో అధికారులను కోరిన పామూరు ఎంపీపీ లక్ష్మి
Pamur, Prakasam | May 2, 2026
పామూరు మండలంలో సమస్యలను పరిష్కరించాలని పామూరు మండల ఎంపీపీ గంగసాని లక్ష్మి ఒంగోలులో శనివారం జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కోరారు. ముఖ్యంగా పామూరు మండలంలో వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా లో వోల్టేజీ సమస్యల పరిష్కారానికి అదనపు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలని కోరారు. పామూరు మండలంలో సీసీ రోడ్లు లేని గ్రామాల్లో సిసి రోడ్లు నిర్మాణం, మౌలిక వసతులు కల్పించాలన్నారు.