మడకశిర పట్టణంలో గ్రామ సింహాల హల్చల్
మడకశిర పట్టణంలో వీధి కుక్కలు హల్చల్ చేస్తున్నాయి. వీధుల్లో గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. రోడ్డుపై వెళ్లాలంటేనే మహిళలు వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి వీధి కుక్కల బెడద తగ్గించాలని ప్రజల విజ్ఞప్తి చేస్తున్నారు.