కుప్పం: కుప్పం డిగ్రీ కళాశాలలో యాంటీ డ్రగ్ అవగాహన: విద్యార్థులకు పోలీసుల సూచనలు
కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మాదకద్రవ్యాల నివారణపై అవగాహన సదస్సు జరిగింది. డ్రగ్స్ వాడకంపై సమాచారం ఉంటే 1972, 112 లేదా చిత్తూరు జిల్లా పోలీస్ వాట్సాప్ నంబర్ 9440900005కు సమాచారం అందించాలని ఏఎస్పీ బొడ్డు హేమంత్ విద్యార్థులను కోరారు.