శక్తి కేంద్రాల బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించాలి: కాకరపాడులో బీజేపీ కొయ్యూరు మండల అధ్యక్షుడు సంపరి శివకుమార్
గ్రామస్థాయి నుండే పార్టీని బలోపేతం చేసేందుకు వీలుగా శక్తి కేంద్రాల నిర్మాణంపై దృష్టి సారించాలని బీజేపీ కొయ్యూరు మండల అధ్యక్షుడు సంపరి శివకుమార్, పాడేరు ఏఎంసీ ఛైర్మన్ మంగతల్లి సూచించారు. కాకరపాడులో ఆదివారం సాయంత్రం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పద్మరాజు అధ్యక్షతన పదాధికారుల సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గ్రామస్థాయి నుండే పార్టీని బలోపేతం చేసి, గెలుపు గుర్రాలను అన్వేషించాలన్నారు.