పెందుర్తి: అనకాపల్లిలో భారీ దొంగతనాల ముఠా అరెస్ట్: 80 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
అనకాపల్లి జిల్లాలో 28 దొంగతనాల కేసులను ఛేదించిన పోలీసులు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 80.33 లక్షల రూపాయల విలువైన బంగారం, వెండి, నగదును స్వాధీనం చేసుకున్నారు. పలు పోలీస్ స్టేషన్ల పరిధిలోని చోరీలకు ఈ ముఠా పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు.