గుంతకల్లు: గుత్తి పట్టణంలోని సత్రం మిట్ట సమీపంలో అదుపు తప్పి ఆటో బోల్తా, ముగ్గురికి గాయాలు, గుత్తి ఆసుపత్రికి తరలింపు
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని సత్రం మిట్ట సమీపంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడి ముగ్గురు గాయపడ్డారు. బాధితులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గుత్తి పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన హరిత తన కుమారుడు హరీష్ ను పాఠశాల నుంచి తీసుకుని వచ్చేందుకు వెళ్లి ఆటోలో ఇంటికి వెళ్తుండగా జెండా గెరి క్రాస్ వద్ద వేగంగా వెళ్తున్న ఆటోకు కుక్క అడ్డు వచ్చింది. గమనించిన ఆటో డ్రైవర్ శ్రీనివాస్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వేగంగా వెళ్తున్న ఆటో అదుపు తప్పి రోడ్డుపై అడ్డంగా పడింది. ఆటో పల్టీలు కొట్టి ముగ్గురు గాయపడగా వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.