గుంతకల్లు: గుత్తి పట్టణంలోని వక్కలకుంటలో మృతి చెందిన చేపలు తొలగింపు, హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని వక్కలకుంటను మునిసిపల్ శానిటేషన్ సిబ్బంది శుభ్రం చేశారు. పట్టణంలోని దాసరి కాలనీకి అనుకుని ఉన్న కుంటలో గత రెండు రోజుల క్రితం భారీగా చేపలు మృతి చెందాయి. కుంటలోని నీటిపై తేలియాడుతూ భారీగా దుర్వాసన వస్తుండటంతో సమీప కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. చేపల మృతితో నీరు కలుషితమై దుర్గంధం వెదజల్లుతోంది. ఈ క్రమంలో పబ్లిక్ యాప్ లో కుంటలో చేపల మృతిపై వార్త రావడంతో మునిసిపల్ కమిషనర్ జబ్బార్ మియా, అధికారులు స్పందించారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కుంటలో నీటిపై తేలియాడుతున్న చేపలను తొలగించి ఖాళీ బస్తాలలో వేసుకుని వెళ్ళారు.