శ్రీశైలం: ఆత్మకూరు పట్టణంలో డంపింగ్ యాడ్ కొరకు స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి
ఆత్మకూరు పట్టణంలో రోజురోజుకూ పెరుగుతున్న చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు మున్సిపాలిటీ కొత్త డంపింగ్ యార్డు ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి ప్రతిపాదిత ప్రాంతాన్ని పరిశీలించారు. డంపింగ్ యార్డు నిర్మాణానికి అనువైన భూభాగం, చెత్త తరలింపుకు అవసరమైన రహదారి సదుపాయాలపై అధికారులు వివరాలు అందించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, పర్యావరణానికి హాని కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.