పామూరు: జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యను నిరసిస్తూ పామూరులో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల నిరసన ర్యాలీ
Pamur, Prakasam | May 5, 2026
పామూరు: చిత్తూరు జిల్లా వీ కోట లో జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యను నిరసిస్తూ పామూరు పట్టణంలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు మంగళవారం నిరసన ర్యాలీ చేపట్టారు. కార్యక్రమానికి హాజరైన సిపిఎం పార్టీ జిల్లా నాయకులు సయ్యద్ హనీఫ్ మాట్లాడుతూ... నిజం కోసం పనిచేసే జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డిని కిరాతకంగా హత్య చేయడాన్ని దేశంలోని మీడియా వర్గాలను సైతం విస్మయానికి గురి చేసిందన్నారు. జర్నలిస్ట్ జగన్ మోహన్ రెడ్డిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.