శ్రీశైలం: శ్రీశైల అమ్మవారికి అగ్గిపెట్టె లో పట్టే పట్టుచీర అమ్మవారికి సమర్పణ సిరిసిల్ల చేనేత కళాకారుడు విజయ్ కుమార్ అద్భుత సృష్టి
శ్రీశైల శ్రీ భ్రమరాంబిక అమ్మవారికి తెలంగాణ రాష్ట్రం సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్ అగ్గిపెట్టెలో పట్టే అరుదైన పట్టు చీరను సమర్పించారు. వారం రోజుల పాటు మగ్గంపై నేసిన ఈ ప్రత్యేక చీర 5.5 మీటర్ల పొడవు, 48 అంగుళాల వెడల్పు, సుమారు 200 గ్రాముల బరువుతో సంప్రదాయ ఇక్కత్ నమూనాలో రూపొందించబడింది. మడత పెడితే చిన్న అగ్గిపెట్టెలో కూడా సులభంగా ఇమిడిపోతుందని విజయ్ కుమార్ తెలిపారు. ఈ ప్రత్యేక వస్త్రాన్ని దేవస్థానం చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడికి అందజేశారు. చేనేత కళాకారుడి ప్రతిభను చైర్మన్ రమేష్ నాయుడు అభినందించారు