పామూరు: పామూరు మండలంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని తహసిల్దార్ వాసు దేవరావుకు వినతి పత్రాన్ని సమర్పించిన జర్నలిస్టులు
Pamur, Prakasam | May 6, 2026
పామూరు మండలంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలని కోరుతూ పామూరు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు పామూరు మండల తహసిల్దార్ వాసుదేవరావును తహసిల్దార్ కార్యాలయంలో కలిసి కోరారు. ఈ సందర్భంగా తహసిల్దార్ కు వారు వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రాగిపాటి సుధాకర్ మాట్లాడుతూ... పాత్రికేయ వృత్తినే నమ్ముకుని ఎన్నో ఏళ్లుగా జీవనాన్ని కొనసాగిస్తున్నామన్నారు. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయడంతో పాటు ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సహకారాన్ని ప్రభుత్వం ద్వారా మంజూరు చేసేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.