వికారాబాద్: లైంగిక వ్యాధుల పట్ల యువత అవగాహన కలిగి ఉండాలి- వికారాబాద్ మున్సిపల్ చైర్మన్ మంజుల
ఎయిడ్స్, లైంగిక వ్యాధుల పట్ల యువత అవగాహన కలిగి ఉండాలని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ అన్నారు. వికారాబాద్ మున్సిపల్ హాల్లో శనివారం మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నైహ్రు యువ కేంద్రం, రంగారెడ్డి జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వారిచే ఎయిడ్స్ లైంగిక వ్యాధులపై టీఓటి యువతకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.