వికారాబాద్: ధ్యానం చేయడం వల్ల ప్రమాదకర జబ్బులు నయం అవుతాయి, పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో ద్యాచారంలో ధ్యానం పై అవగాహన సదస్సు.
ప్రతినిత్యం శ్వాస మీద ధ్యాస, అనే ధ్యానం చేయడం ద్వారా ప్రమాదకర జబ్బులు కూడా నయం చేసుకోవచ్చని, పిరమిడ్స్ స్పిరిచువల్ సొసైటీ ధ్యానప్రచార కార్యదర్శి బంగ్లా ఆంజనేయ రెడ్డి అన్నారు. శనివారం వికారాబాద్ మండల పరిధిలోని ద్యాచారం గ్రామంలో ధ్యానం యొక్క లాభాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.