నరసన్నపేట: నరసన్నపేట నామినేషన్ కేంద్రంలో సీఐ తనిఖీలు: భద్రతపై అధికారులకు ఆదేశాలు
నరసన్నపేట మండల పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న నామినేషన్ ప్రక్రియను సీఐ శ్రీనివాసరావు పరిశీలించారు. ఈరోజు నామినేషన్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు.