ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఫుట్బాల్ క్రీడాకారులకు మాజీ ఎంపీ బుట్టా రేణుక క్రీడా సామగ్రి పంపిణీ..
క్రీడా సామగ్రి పంపిణీ చేసిన బుట్టా రేణుక..ఎమ్మిగనూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఫుట్బాల్ క్రీడాకారులకు మాజీ ఎంపీ బుట్టా రేణుక క్రీడా సామగ్రి, షూస్ ఆదివారం పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు క్రీడల్లో రాణించాలన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయని సూచించారు. పేద విద్యార్థులకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు.కార్యక్రమంలో ఆమె భర్త శివ నీలకంఠ పాల్గొన్నారు.