అదిలాబాద్ అర్బన్: వన్యప్రాణుల రక్షణకు పోలీసు, అటవీ శాఖల సమన్వయం ముఖ్యం: ఆదిలాబాద్ ఎస్పీ
వన్యప్రాణుల వేట, అక్రమ రవాణా, గంజాయి సాగును అరికట్టేందుకు పోలీసు మరియు అటవీ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ఈ మేరకు అధికారులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు.