మోతే: నాగయ్య గూడెంలో భూ వివాదంలో తండ్రిని వేట గొడ్డలితో నరికి చంపిన కొడుకు
సూర్యాపేట జిల్లా, కోదాడ. భూ వివాదంలో తండ్రిని వేట గోడలితో దాడి చేసి హత్య చేసిన ఘటన సూర్యాపేట జిల్లా మోతే మండలం నాగయ్య గూడెం గ్రామంలో చోటుచేసుకుంది.తండ్రి వెంకన్న కు కుమారుడు గంగయ్య కు కొద్దీ రోజులుగా భూ వివాదం జరుగుతుంది.వెంకన్న ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గంగయ్య వెనకనుంచి గోడలితో దాడి చేయడంతో రోడ్డు పక్కన పడి ఉండడాని గ్రామస్తులు తెలిపారు. సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యంలో మృతిచెందినట్లు తెలిపారు.కేస్ నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.