హిందూపురం ఆర్టీవో కార్యాలయం వద్ద హిందూపురంలోనీ స్కూల్ బస్సు డ్రైవర్లకు వాహన ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం RTO ఆఫీస్ కార్యాలయం వద్ద మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు వరప్రసాద్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉదయ్ కుమార్లు తమ సిబ్బందితో కలిసి స్కూల్ బస్ డ్రైవర్ లకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. స్కూల్ బస్సుల యొక్క యొక్క రికార్డ్స్ ఇన్సూరెన్స్, పర్మిట్, ఫిట్నెస్, డ్రైవర్ లైసెన్స్, రోడ్ టాక్స్ లను తనిఖీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 560 స్కూల్ బస్సులను హిందూపురం లో 95 బస్ లు తనిఖీ చేశారు. ఎమర్జెన్సీ ద్వారము, బస్సులలో అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తనిఖీ చేయడం జరిగింది