జిల్లా పోలీసు కార్యాలయంలో పదవీ విరమణ పొందిన ముగ్గురు పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ చేతుల మీదుగా ఘనంగా సన్మానo
Anantapur Urban, Anantapur | Apr 1, 2026
జిల్లాలో పదవీ విరమణ పొందిన ముగ్గురు పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ జగదీష్ చేతుల మీదుగా బుధవారం రాత్రి 7 గంటల సమయంలో ఘనంగా సన్మానం నిర్వహించారు. అనంతపురం జిల్లా ఏ.ఆర్ విభాగంలో పని చేస్తున్న ఏఆర్‌ఎస్‌ఐ గంగన్న, అనంతపురం 2 టౌన్ హెడ్ కానిస్టేబుల్ షాజాద్ బాషా, జిల్లా పోలీసు కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా సేవలందించిన సుధారాణి లకు ఎస్పీ గారు తన ఛేంబర్లో సన్మానం చేసి, వారి దీర్ఘకాల సేవలను కొనియాడారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పదవీ విరమణ అనేది ఉద్యోగ జీవితానికి ముగింపు అయినప్పటికీ, సమాజానికి సేవ చేయడానికి ఇది మరో అవకాశమని తెలిపారు.