పలమనేరు: వి.కోట: బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని, కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసిన మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ్
వి.కోట:పట్టణం కమిటీ హాల్ లో పలమనేరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వెంకటే గౌడ అధ్యక్షతన మండల వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో "క్యూర్ కోడ్ పోస్టర్" ఆవిష్కరించి మాట్లాడారు. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు సైతం నెరవేర్చలేదు,గత ఎన్నికల్లో బాబు మోసపూరిత మాటలు నమ్మి ప్రజలు అధికారం కట్టబెట్టగా హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాలను మోసగించారు. సంపద సృష్టిస్తానని చెప్పి విపరీతంగా అప్పులు చేస్తున్నారు, అయినా సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేయడం లేదని విమర్శించారు, మామిడికి గిట్టుబాటు ధర కల్పించాల్సిందిగా డిమాండ్ చేశారు.