కర్నూలు: మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయి: కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్
మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. మంగళవారం ఎస్ఏపీ క్యాంపులో ఏర్పాటు చేసిన వేసవి బాస్కెట్ బాల్ శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో ఏపీఎస్పీ కమాండెంట్ దీపిక పాటిల్తో కలిసి ఆయన పాల్గొన్నారు. పిల్లలకు బహుమతులు ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. నిత్యం క్రీడల్లో సాధన చేస్తే వాటి ద్వారా వచ్చే ప్రశంసా పత్రాల వల్ల విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు.