మంచిర్యాల: పెద్దపల్లిలో ఆర్యూబీ పనులు వచ్చే ఏడాదిలోగా పూర్తి: రైల్వే అధికారుల హామీ
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చొరవతో నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న 9 ఆర్యూబీ పనులను వచ్చే ఏడాదిలోగా పూర్తి చేసేందుకు రైల్వే అధికారులు హామీ ఇచ్చారు. ఎల్సీ-30, 35, 37 ప్రాంతాల్లోని డ్రైనేజీ సమస్యలపై చర్చించిన ఎంపీ, పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.