గజ్వేల్: జగదేవ్ పూర్ మండలంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హైమావతి
సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలంలో మంగళవారం జిల్లా కలెక్టర్ హైమావతి పర్యటించి పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ముందుగా మండలం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. అటెండెన్స్ రిజిస్టర్ వెరిఫై చేశారు. ఓ పి రిజిస్టర్ వెరిఫై చేస్తూ ఉదయం 11.15 వరకు 2 మాత్రమే ఓ పి చూశారని మెడికల్ ఆఫీసర్ సత్య ప్రకాష్ నీ అడగ్గా మెడిసిన్ స్టోర్ లో మందుల పంపిణీకి వెళ్లివచ్చానని కలెక్టర్ కి తెలిపారు. ఒళ్ళు నొప్పులు, మాములు జ్వరం తో ఆసుపత్రికి వచ్చిన వృద్ధురాలితో మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్యం చేయించుకోవాలని డాక్టర్ లు చెప్పిన విషయాలు తప్పనిసరిగా పాటిం