నాంపల్లి: తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి పొంగిపొర్లుతున్న చామలపల్లి వాగు, హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
నల్గొండ జిల్లా, నాంపల్లి మండలం, చామలపల్లి గ్రామంలో తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి వాగు పొంగిపొరుగుతుంది. బుధవారం మధ్యాహ్నం స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎగువన తెల్లవారుజామున భారీ వర్షం కురవడంతో చామలపల్లి వాగు పొంగిపొర్లుతుండడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాగు పొంగడం వల్ల భూగర్భ జలాలు పెరిగి, బోర్లకు నీళ్లు అందుతాయని రైతులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాగు కుదిరితంగా ప్రవహిస్తుండడం తో వాగులోకి వెళ్ళరాదని అధికారులు హెచ్చరించారు.