శ్రీకాకుళం: నరసన్నపేటలో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన ఎస్పీ మహేశ్వర్ రెడ్డి
నరసన్నపేట మండల పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియను ఎస్పీ కె.వి మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉన్నాయని, ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై గణేశ్ పాల్గొన్నారు.