శ్రీశైలం: శ్రీశైలంలో వెలుగు చూసిన మరో సైబర్ మోసం.మల్లికార్జున సదన్ పేరుతో ఢిల్లీ యాత్రికులకు టోకరా
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో మరోసారి సైబర్ మోసం వెలుగుచూసింది. మల్లికార్జున సదన్ పేరుతో నకిలీ ఆన్‌లైన్ బుకింగ్ నిర్వహించిన సైబర్ నేరగాళ్లు ఢిల్లీకి చెందిన యాత్రికులను మోసం చేశారు.9 ఏసీ గదుల బుకింగ్ కోసం పేటీఎం ద్వారా రూ.15 వేల రూపాయలు చెల్లించిన ఢిల్లీ వాసి ఆనంద్ కుమార్.. ఈరోజు హైదరాబాద్ నుంచి టూరిస్ట్ బస్సులో 27 మంది భక్తులతో కలిసి శ్రీశైలం చేరుకున్నారు. మల్లికార్జున సదన్ వద్ద గదుల కోసం సంప్రదించగా ఎలాంటి బుకింగ్ నమోదు కాలేదని సిబ్బంది చెప్పడంతో మోసం జరిగిన విషయం బయటపడింది. దీంతో బాధిత భక్తుడు అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.