కాకినాడ రూరల్ ఇంద్ర పాలెం గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని కాకినాడ రూరల్ తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యం లో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హాజరై ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచ పెడుతూ గత సంవత్సర కాలంలో రాష్ట్రంలో చేసిన అభివృద్ధి గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా సుభాష్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా రాజధాని లేని రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి నిర్మించాడని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు సుపరిపాలన అందించి అనేక సంక్షేమ పథకాలను ఇస్తున్నారు.