అశ్వారావుపేట: అంతర్ పంటల సాగుతో రైతుల ఆర్థిక అభివృద్ధి సాధ్యం అవుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ పార్టీ అన్నారు
అంతర పంటల సాగుతో రైతులు ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు.సోమవారం ములకలపల్లి మండలం మూక మామిడి పంచాయతీ పరిధిలోని గుట్టగూడెం గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన వెదురు సాగును సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ రైతులు భద్రయ్య,రాధా,పొట్టమ్మల పొలాల్లో స్వయంగా వెదురు మొక్కలు నాటి,గ్రామీణ వ్యవసాయ రంగంలో కొత్త అవకాశాలను సృష్టించేందుకు రైతులు ముందుకు రావాలని సూచించారు.