శ్రీశైలం: బైక్ పై కుటుంబ సభ్యులు ముగ్గురు హెల్మెట్ ధరించి పలువురుకు ఆదర్శంగా నిలుస్తున్న గాజులపల్లికి చెందిన బాబు కుటుంబ సభ్యులు
నేటి కాలంలో ప్రమాదాలు అధికమవుతున్న తరుణంలో భద్రతను గుర్తెరిగి పలువురికి ఆదర్శంగా నిలిచిన ఓ కుటుంబానికి పోలీసుల అభినందనలు వెల్లువెత్తాయి. శనివారం గాజులపల్లెకి చెందిన మాబూ కుటుంబ సభ్యులు నంద్యాల నుంచి వస్తుండగా బోయలకుంట్ల మెట్ట వద్ద బందోబస్తు చేస్తున్న ఎస్సై రామ్మోహన్ రెడ్డి అభినందించారు. కుటుంబ సభ్యులతోపాటు చిన్నారికి హెల్మెట్ ధరించడం పట్ల అభినందించారు. ఇలాంటి వ్యక్తులను మనమందరం ఆదర్శంగా తీసుకొని రోడ్డు ప్రమాద నివారణలో ప్రాణాలు కాపాడుకోవాల్సిందిగా ఎస్సై సూచించారు.