ఒంగోలు అర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆకతాయుల ఆట కట్టించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించిన పోలీసులు, షీ టీమ్స్ పై అవగాహన
Ongole Urban, Prakasam | Aug 3, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పాఠశాలలు కళాశాలలు వద్ద పోలీసులు భద్రతలు కట్టు తీయడం చేశారు. పాఠశాలలు కళాశాలలు వదిలిన సమయంలో ఆకతాయిల ఆట కట్టించేందుకు డ్రోన్ ఎగరవేసి స్కై ప్రాజెక్టు కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు చెప్పారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో ప్రతిరోజు స్కై ప్రాజెక్టు నిర్వహిస్తున్నామన్నారు. శక్తి యాప్ ద్వారా మహిళలు తమ భద్రత కొరకు పోలీసుల సహాయాన్ని అడగవచ్చు అన్నారు. ఇప్పటికే వారి భద్రత కొరకు షీ టీమ్స్ ఏర్పాటు చేసినట్లు పోలీసులు చెప్పారు. శక్తి యాప్ ఉపయోగించి షీ టీమ్స్ ని సంప్రదించవచ్చన్నారు.